Monday, 1 February 2021

కార్తి ‘సుల్తాన్’ టీజర్: కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. మహాభారతం ఇలా ఉంటుందా!

హీరోగా బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుల్తాన్’‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతున్న ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రధారులు. ఏప్రిల్ 2న ‘సుల్తాన్’‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే, సోమ‌వారం సాయంత్రం ‘సుల్తాన్’ టీజ‌ర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న త‌న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘సుల్తాన్’ తెలుగు టీజ‌ర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని రష్మిక పేర్కొన్నారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ టీజ‌ర్.. ‘‘మ‌హాభారతం చ‌దివావా? భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వమంటోంది ఒక్క అవ‌కాశ‌మే క‌దా. ఇస్తా’’ అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ కార్తీతో అన‌డంతో మొద‌లైంది. అందుకు కార్తి.. ‘‘మ‌హాభార‌తంలో కృష్ణుడు పాండ‌వుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే? అదే మ‌హాభార‌తాన్ని ఒక‌సారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్’’.. అని స‌మాధాన‌మివ్వడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టీజ‌ర్ ప్రకారం జోవియ‌ల్‌గా ఉండే ఓ యువ‌కుడు త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల కార‌ణంగా కౌర‌వుల్లాంటి దుష్టుల‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అత‌ను అలా మార‌డానికి దారితీసిన ఆ ప‌రిస్థితులేమిటి అనే అంశాల‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శకుడు బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో తీర్చిదిద్దిన‌ట్లు అర్థమ‌వుతోంది. టైటిల్ రోల్‌లో కార్తి అద‌ర‌గొడుతున్నారు. హీరోయిన్ ర‌ష్మిక ఓ ప‌ల్లెటూరి యువ‌తి క్యారెక్టర్‌లో ద‌ర్శన‌మివ్వనున్నారు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’లో విల‌న్ ‘గ‌రుడ‌’గా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న రామ‌చంద్రరాజు ఈ సినిమాలో ఓ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. త‌మిళ సీనియ‌ర్ యాక్టర్ నెపోలియ‌న్‌, మ‌ల‌యాళం పాపుల‌ర్ యాక్టర్ లాల్ పాత్రలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పట్లా యోగిబాబు న‌వ్వులు పండించ‌నున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి స‌త్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రూబెన్ ఎడిటర్. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. బృంద‌, శోబి, దినేష్‌, క‌ల్యాణ్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రాకేందు మౌళి, చంద్రబోస్, కృష్ణకాంత్‌, శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. తెలుగు డైలాగులను రాకేందు మౌళి రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pFpuTV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...