Friday, 19 February 2021

‘టక్ జగదీష్’ టీజర్, ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్.. అప్‌డేట్ ఇచ్చిన నాని

నేచురల్ స్టార్ నాని తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఆయన హీరోగా రూపొందుతోన్న ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలకు సంబంధించి నాని అప్‌డేట్ ఇచ్చారు. ‘టక్ జగదీష్’ టీజర్, ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ సిద్ధంగా ఉన్నాయని నాని ట్వీట్ చేశారు. అయితే, ఇవి ఎప్పుడు విడుదల చేస్తున్న విషయం మాత్రం నాని చెప్పలేదు. కానీ, అసలు విషయం బయటికి వచ్చింది. ‘టక్ జగదీష్’ మోషన్ పోస్టర్‌ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్‌తో పాటు టీజర్ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించనున్నారు. కాగా, ‘నిన్నుకోరి’ సినిమా తరవాత డైరెక్టర్ శివ నిర్వాణతో నాని చేస్తున్న సినిమా ‘టక్ జగదీష్’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు కోల్‌కతాలో సుధీర్ఘ షెడ్యూల్ జరుగుతోంది. రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి స‌త్యదేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చగా, మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aEvA25
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...