Monday, 1 February 2021

విక్రాంత్ రోణ: రెండు వేల అడుగుల భారీ కటౌట్‌.. కిచ్చా సుదీప్ కొత్త రికార్డ్

శాండిల్‌వుడ్‌ బాద్‌షా సినీ పరిశ్రమలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’‌ టైటిల్‌ లోగో, స్నీక్‌ పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై విడుదల చేశారు. ఈ వేడుక ఆదివారం (జనవరి 31) రాత్రి 9 గంటలకు జరిగింది. ఈ వేడుక కిచ్చా క్రియేషన్స్ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో సిల్వర్‌ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌.. ‘విక్రాంత్ రోణ‌’తో సరికొత్తగా పరిచయం అయ్యారు. కొవిడ్‌ ప్రభావం తర్వాత షూటింగ్‌ను స్టార్ట్‌ చేసిన భారీ బడ్జెట్‌ మూవీ ‘విక్రాంత్ రోణ‌’. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై ‘విక్రాంత్ రోణ‌’ టైటిల్‌ లోగో, స్నీక్‌ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త ఆధ్యాయానికి కిచ్చా సుదీప్‌ శ్రీకారం చుట్టారు. బుర్జు ఖలీఫాపై సుదీప్ నిలువెత్తు కటౌట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ భవంతిపైనే ‘విక్రాంత్ రోణ’ స్నీక్ పీక్‌ వీడియోను చూసి అబ్బురపడ్డారు. గ్రాండ్‌ లెవల్లో జరిగిన ‘విక్రాంత్ రోణ‌’ టైటిల్‌ లోగో, స్పీక్‌ పీక్‌ రిలీజ్‌ వేడుక ఇండియన్‌ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. మూడు నిమిషాలు వ్యవథి గల ‘విక్రాంత్ రోణ‌’ స్నీక్‌ పీక్‌ వీడియోను బుర్జ్‌ ఖలీఫాపై ప్లే చేయడం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వేడుక కోసం సుదీప్‌ 2000 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఎత్తున్న కటౌట్‌తో సుదీప్‌ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ‘విక్రాంత్ రోణ‌’ చిత్రానికి అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. అలంకార్‌ పాండియన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cBoIE1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...