Saturday, 6 February 2021

చావు కబురు చల్లగా: సత్తే.. ఏమవుతాదిరో! చావు గురించి చల్లగా చేప్పేసిన బస్తీ బాలరాజు

'' అంటూ యంగ్ హీరో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వం వహిస్తుండగా.. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. ఇటీవలే చిత్ర రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ విశేష స్పందన తెచ్చుకోగా, తాజాగా 'మై నేమ్ రాజు.. సత్తే.. ఏమవుతాదిరో' అంటూ సాగే హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్‌ రిలీజ్ చేసి ప్రేక్షకుల చూపు తమ సినిమా వైపు తిప్పుకున్నారు. ఈ పాటను సింగర్‌ రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల లిరిక్స్ రాశారు. మనిషి జీవితం, చావు గురించి చల్లగా వివరించడంతో ఈ లిరికల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోందట. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని, అతిత్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. మార్చి 19వ తేదీన ఈ 'చావు కబురు చల్లగా'తో థియేటర్స్‌లో దిగబోతున్నాడు కార్తికేయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rvfsoS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...