Saturday, 20 February 2021

‘దృశ్యం 2’‌కి బ్లాక్ బస్టర్ టాక్.. రీమేక్‌కి వెంకీ మామ రెడీ

ఆరేళ్ల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘దృశ్యం’. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేయగా.. రీమేక్ చేసిన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో విక్టరీ , తమిళ్‌లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం’‌తో హిట్లు అందుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కూతురు ఒక హత్య చేస్తే ఆమె తండ్రి ఆ కేసు నుంచి ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించింది. దాదాపు ఆరేళ్ల తరువాత ‘’ సీక్వెల్ రావడంతో ఇప్పుడంతా ఈ సినిమాపైనే చర్చ నడుస్తోంది. ఓటిటి - అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘దృశ్యం 2’ హిట్ టాక్‌తో రీమేక్ చర్చలు మొదలుపెట్టేశాడు విక్టరీ వెంకటేష్. తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్.. నిర్మాతలు ఆంటోని పెరుంవబూర్‌లు విక్టరీ వెంకటేష్‌ని కలిశారు. వీరితో పాటు నిర్మాత సురేష్ బాబు కలిసి ‘దృశ్యం 2’ రీమేక్ గురించి చర్చలు జరిపారు. అయితే జూన్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్ మొదలుపెట్టి.. రెండు నెలల్లోనే కంప్లీట్ చేసి ఆగష్టు 15న ‘దృశ్యం 2’ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qE8g9T
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...