Saturday, 20 February 2021

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి ట్రెండింగ్ నెం.1లో ‘పాగల్’ టీజర్.. ఫలించిన విశ్వక్ సేన్‌ ‘తారక’ మంత్రం

ప్రేమ కోసం ‘పాగల్’గా మారాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ‘ఫ‌ల‌క్ నామా దాస్’, ‘హిట్‌’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలంగాణ పోరడు ‘పాగల్’ చిత్రంతో వైల్డ్ లవర్‌గా మారాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో () నటించిన తాజా చిత్రం `పాగల్`. సిమ్రన్ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా.. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఏయ్ ఎవడ్రా నా లవర్‌ని ఏడిపించింది’ అంటూ వైల్డ్ లవర్‌గా కనిపించాడు విశ్వక్ సేన్. నా లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపించడం లేదురా.. స్ట్రాంగ్‌ కొట్టండి.. వైల్డ్‌గా కొట్టండి.. నా లవ్‌***లా అంటూ కాస్త హార్డ్ డైలాగ్‌నే కష్టపడుతూ చెప్పాడు విశ్వక్. మొత్తంగా లవర్ బాయ్‌లా ఫ్రెష్‌లుక్‌లో కనిపించారు విశ్వక్ సేన్. అయితే ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ (తెలుగు) వీడియో లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి 3.3 మిలియన్ వ్యూస్ సాధించి () యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఇక లైక్‌లు కామెంట్లు మోత మోగిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంతకీ విశ్వక్ సేన్ ‘పాగల్’ టీజర్‌కి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి లింక్ ఏంటి? అంటే.. విశ్వక్ సేన్ ఎన్టీఆర్‌కి విరాభిమాని కావడమే. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఆయన బర్త్‌డే సందర్బంగా ఒక ర్యాప్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి దగ్గరయ్యాడు. అప్పటి నుంచి విశ్వక్ సేన్‌‌ సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నీ తామై చూసుకుంటున్నారు. ‘నీకు అండగా మా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటాం అన్నా.. నువ్వు మా దేవుడికి అభిమానివి అయితే నువ్వు కూడా మాకు అంతే.. జై ఎన్టీఆర్.. ఊసరవిల్లి సినిమాలో మా ఎన్టీఆర్‌లా కనిపించావ్ అన్నా పాగల్ టీజర్‌లో.. అదరగొట్టెయ్.. ఎన్టీఆర్‌ని ఆడియో ఫంక్షన్‌కి తీసుకురా అన్నా’ అంటూ విశ్వక్ సేన్ పాగల్ టీజర్‌పై స్పందనలు తెలియజేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏప్రిల్ 30వ తేదీన ‘పాగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qDRpEo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...