Monday, 11 January 2021

Virat Kohli: పండంటి బిడ్డకు జన్మిచ్చిన అనుష్క శర్మ.. థ్రిల్ అవుతున్నానంటూ పొంగిపోయిన విరాట్

కొత్త ఏడాది ఆరంభంలోనే అభిమానులను గుడ్ న్యూస్ చెప్పారు . తమకు పండంటి బిడ్డ జన్మించిందని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనుష్క ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ ''2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం'' అని కొన్ని నెలల క్రితం అఫీషియల్‌గా ప్రకటించిన విరాట్.. తాజాగా తమకు ఆడబిడ్డ జన్మించిందని తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో ఇటు అనుష్క ఫ్యాన్స్, అటు విరాట్ ఫ్యాన్స్ సంతోషంతో ఇద్దరికీ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ''ఈ రోజు (జనవరి 11) మధ్యాహ్నం మా ఆడబిడ్డ జన్మించిందని చెబుతూ చాలా సంతోషిస్తున్నాము. ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. అనుష్క ప్రెగ్నెంట్ అని తెలిశాక మీరు చూపించిన ప్రేమ, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. జన్మించిన బేబీ, అనుష్క ఆరోగ్యంగా ఉన్నారు. ఇకపై మా కూతురితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండటం ఆనందంగా ఉంది'' అని పేర్కొంటూ విరాట్ కోహ్లీ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. 2017 డిసెంబర్‌లో విరాట్ కోహ్లి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న ఈ జోడీ వీలు కుదిరినప్పుడల్లా సరదాగా సమయం గడుపుతుంటారు. చివరగా జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క.. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌లు నిర్మించింది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్'లో ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LJ0Fav
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...