Saturday, 9 January 2021

Vakeel Saab: వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్.. ఈ సంక్రాంతికి అదిరిపోయే కానుక సిద్ధం

జనసేన పార్టీ తరఫున రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే 'వకీల్ సాబ్' మూవీ పూర్తి చేశారు పవర్‌ స్టార్ . శనివారం షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన దర్శకనిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. రీ ఎంట్రీలో వరస సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను హుషారెత్తిస్తున్న పవన్‌ కళ్యాణ్.. ఈ సంక్రాంతికి నుంచి ఓ కానుక సిద్ధం చేశారు. సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 14వ తేదీ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఆ క్షణం కోసం పవన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషించారు. 'పింక్' మూవీ తెలుగు రీమేక్‌గా ఈ 'వకీల్ సాబ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39iBeEX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...