Wednesday, 6 January 2021

Thank You: క్రేజీ అప్‌డేట్.. మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగ చైతన్య!

ప్రతి స్టార్ హీరోకి ప్రత్యేకంగా కొన్ని అభిమాన సంఘాలు ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో సంఘం ఉండటమే గాక వాటికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షకుడు అనే పదవులు కేటాయించి ఆయా ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు వారికి అప్పజెప్పేస్తారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజున, అలాగే పుట్టిన రోజున ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ హంగామా చేస్తుంటుంది. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కనిపిస్తారని తెలుస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'లో ఆయన రోల్ ఇదే అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అభిరామ్ అనే యువకుడి పాత్ర పోషిస్తున్న నాగ చైతన్య.. సూపర్ స్టార్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అలరించబోతున్నారని సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ సంరపడుతున్నారు. ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ పైగా వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకుంటున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ 'థాంక్యూ' మూవీ రూపొందుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి బీవీఎస్‌ రవి కథ అందించగా.. నాగ చైతన్య సరసన ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు రీసెంట్‌గా శేఖర్ కమ్ముల 'లవ్‌స్టోరి' సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాగ్ చైతన్య అతి త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38iL2j5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...