మెల్లామెల్లగ వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది ఫిదా బ్యూటీ . గ్లామర్ రోల్స్, ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ తనదైన నటనతో క్లాస్, మాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తోంది. పాత్ర నచ్చాలే గానీ వెంటనే ఓకే చేసి అందులో లీనమైపోతా అని చెప్పే ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్లు అర్జున్‌తో తెర పంచుకోవడానికి రెడీ అయిందని టాక్. అదికూడా బన్నీ చెల్లెలుగా!. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ''. ఈ సినిమాలో బన్నీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తొలిసారి పూర్తిస్థాయి మాస్ రోల్‌లో మెప్పించనున్నారు. ఈ మూవీ బన్నీ పాత్ర పేరు పుష్పరాజ్. అయితే ఈ కథలో పుష్పరాజ్ చెల్లెలి పాత్ర చాలా కీలకమైందట. ఈ మేరకు బన్నీ చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నారని సమాచారం. మరోవైపు సాయి పల్లవి కెరీర్ మంచి పీక్స్‌లో ఉంది. వరుస అవకాశాలతో భారీ ప్రాజెక్ట్స్ ఆమె ముంగిట నిలుస్తున్నారు. దీంతో ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో చెల్లెలిగా నటించడమంటే చాలా ధైర్యం చేస్తున్నట్లే అంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం రానా సరసన 'విరాటపర్వం 1992' మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. సో.. చూడాలి మరి 'పుష్ప' మూవీలో కూడా సాయి పల్లవి నిజంగానే భాగం కాబోతుందా? లేక ఇది రూమరేనా అనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35dce0y
v
No comments:
Post a Comment