Tuesday, 5 January 2021

రాఘవేంద్ర రావు మాజీ కోడలి రెండో పెళ్లి.. న్యూ జర్నీ స్టార్ట్ అంటూ మురిసిపోయిన కనిక

దర్శకేంద్రుడు , ప్రకాష్ కోవెలమూడి మాజీ భార్య, సినీ ర‌చ‌యిత చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రకాష్ కోవెలమూడితో విడాకులు చేసుకున్న కనికా బాలీవుడ్ ర‌చయిత హిమాన్షు శ‌ర్మను పెళ్లాడారు. తాజాగా ఇద్దరూ పెళ్లి దండలతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ 'న్యూ జర్నీ స్టార్ట్' అని పేర్కొన్నారు క‌నికా థిల్లాన్. అనుష్క లీడ్ రోల్‌లో వచ్చిన 'సైజ్ జీరో' సినిమాకు కథా రచయితగా పని చేశారు క‌నికా థిల్లాన్. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే కనికా- ప్రకాష్ ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజులు బాగానే ఉన్న వీళ్ళ కాపురంలో కలహాలు తలెత్తడంతో కొన్నేళ్ల క్రితం విడిపోయారు. ఎలాంటి గొడవ హడావుడి చేయకుండా విడిపోవడంతో వీళ్ళ మ్యాటర్ పెద్దగా జనాలకు తెలియలేదు. అయితే ప్రకాష్‌తో విడిపోయాక కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న కనికా.. ఆ తర్వాత బాలీవుడ్ ర‌చయిత హిమాన్షు శ‌ర్మను ప్రేమించి డిసెంబర్ నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా అతనితో ఏడడుగులు కూడా వేశారు. ఎలాంటి అట్టహాసం లేకుండా నిరాడంబ‌రంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు. ఈ ఫొటోలను పంచుకున్న కనికా 'కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం' అనే క్యాప్షన్ పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ndkGTF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...