Wednesday, 6 January 2021

Krack‌తో హ్యాట్రిక్.. సుమ వెటకారంపై మాస్ రాజా పంచ్‌లు, ప్రీ రిలీజ్‌లో రవితేజ స్పీచ్

‘క్రాక్’ సినిమాతో థియేటర్స్‌లో రికార్డుల్ని చేయడానికి వచ్చేస్తున్నాడు మాస్ రాజా . సంక్రాంతి కానుకగా జనవరి 9న 1000 స్క్రీన్స్‌కి పైగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది క్రాక్. డాన్ శీను, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. శృతి హాసన్‌‌ రవితేజతో జోడీ కట్టింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో మాస్ రాజా రవితేజ మాట్లాడుతూ.. గోపిచంద్ మలినేని కాంబోలో హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సుమ మాటలు విని సంవత్సరం అయిపోయింది. వెటకారాన్ని చాలా మిస్ అయిపోయాం. ఈ సినిమాలో సముద్రఖనితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. బుర్రా సాయి మాధవ్ అదిరిపోయే డైలాగ్‌ రాశారు. బూమ్ బద్దలు స్పెషల్ సాంగ్ చేసిన అప్సర నిజంగానే బద్దలు చేసింది. నా సినిమాకి బంగారం లాంటోళ్లు రామ్-లక్ష్మణ్‌లు. వాళ్లలో పాటిజివ్‌ తప్ప నెగిటివ్ ఇప్పటివరకూ చూడలేదు. అలీతో ఎన్ని సినిమాలు చేసినా.. అన్నీ బ్రహ్మాడంగా ఆడాయి. తమన్ నాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. నాకు ఎప్పుడూ మంచి పాటలే ఇస్తాడు తమన్. మలినేని గోపీచంద్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ రావాలని కోరుకుంటున్నా. నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని కోరుతున్నా. హీరోయిన్ శృతి హాసన్‌‌తో ఇది నా రెండో సినిమా. షూటింగ్ వల్ల తన ప్రీ రిలీజ్ రాలేకపోయింది. సక్సెస్ మీట్‌లో కలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.. జనవరి 9న థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ తన స్పీచ్ ముగించారు మాస్ రాజా రవితేజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MwEwg4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...