Wednesday, 27 January 2021

FCUK: నేనేం చెయ్య.. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులతో హీరో జగపతిబాబు.. వినూత్న ఆలోచన!!

అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను కెమెరాలో బంధించడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాను జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం అంతే ముఖ్యం. అందుకే సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా '' () మూవీ టీం వినూత్న ఆలోచన చేసి.. ఈ సినిమా లోని పాటలను రీల్ హీరోల‌కు బ‌దులు రియ‌ల్ హీరోల‌తో విడుదల చేపిస్తున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ వస్తున్నారు. తాజాగా బుధ‌వారం "నేనేం చెయ్య‌.." అంటూ సాగే చిత్రంలోని రెండో పాట‌ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులతో విడుద‌ల చేయ‌డం గ‌మనార్హం. లాక్‌డౌన్ టైమ్‌లో కొవిడ్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టం కోసం నిర్విరామంగా పనిచేసి, ఒక‌వైపు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చూస్తూ, మ‌రోవైపు ఆరోగ్య‌సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే చిరు ప్ర‌య‌త్నంతో ఈ సాంగ్ ఇలా వారితో రిలీజ్ చేయించారట మేకర్స్. ఈ పాట‌ను జగ‌ప‌తిబాబుపై చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు 'నేనేం చెయ్య‌..' పాట‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, ఈ పాట‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని అన్నారు. త్వ‌ర‌లో మ‌రో రెండు పాట‌ల‌ను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, చైల్డ్ ఆర్టిస్ట్ సహశ్రిత ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ 'ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్' (FCUK) సినిమాను ఈ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. విద్యాసాగ‌ర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జగపతి బాబు, అమ్ము అభిరామి లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39m4g81
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...