Wednesday, 27 January 2021

లైగర్ అక్కడే.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫిక్సయ్యారిలా! విజయ్ దేవరకొండతో ప్లాన్ రెడీ..

గతేడాది కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ కారణంగా మూతబడిన సినిమా షూటింగ్స్ తిరిగి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. షూటింగ్స్ చేసుకునేందుకు అనుమతులు లభించినా కాస్త టైమ్ తీసుకొని తమ తమ సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న '' మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు పూరి జగన్నాథ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పూరి.. షూటింగ్ లొకేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. అయితే కథ ప్రకారం చిత్రీకరణ మొత్తం ముంబైలో చేయాల్సి ఉంది.. కానీ అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్న చిత్రయూనిట్, హైదరాబాద్‏లోనే ముంబై సెట్ వేసి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు 'లైగర్' తదుపరి షెడ్యూల్ షూటింగ్ ముంబైలోనే చేయాలని పూరి ఫిక్సయినట్లు తెలిసింది. ఈ మేరకు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39qrx8Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...