Tuesday, 12 January 2021

‘కపటధారి’ ట్రైలర్: మెట్రో తవ్వకాల్లో అస్తిపంజరాలు.. సమంత మెచ్చిన సుమంత్ క్రైమ్ స్టోరీ

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు. ‘సత్యం’, ‘గౌరి’ లాంటి సినిమాలతో క్రేజ్ సంపాదించిన సుమంత్.. ఆ తరవాత తన మార్క్ చూపించలేకపోయారు. అయితే, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజ‌గ‌త్‌’ చిత్రాల‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు ‘క‌ప‌ట‌ధారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క‌న్నడలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కవలుదారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై లలిత ధనంజయన్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘కపటధారి’ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్కినేని వారి కోడలు సమంత మంగళవారం ‘కపటధారి’ ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని అస్తిపంజరాలు బయటపడతాయి. అవి ఎవరివి, ఎవరు హత్య చేశారు వంటి విషయాలతో సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ మూవీ. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ట్రాఫిక్ ఎస్ఐ అయిన సుమంత్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమిటి అనేది సినిమాలోనే చూడాలి. ఈ చిత్రంలో సుమంత్ సరసన నందితా శ్వేత నటించారు. పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డాక్టర్ ధ‌నంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేయగా.. బాషాశ్రీ మాట‌లు అందించారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ప‌నిచేశారు. సైమన్ కె. కింగ్ సంగీతం సమకూర్చారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oxCYRb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...