Friday, 1 January 2021

అల్లు అర్జున్‌కి బ్ర‌హ్మానందం సూపర్ గిఫ్ట్.. అభిమానులతో పంచుకుంటూ బన్నీ ఎమోషనల్ కామెంట్స్

వెండితెరపై నవ్వులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ ప్రేక్షకులకు వినోదం పంచే బ్ర‌హ్మానందంలో మరో అరుదైన కళ దాగిఉంది. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నినెలలపాటు ఇంటికే పరిమితమైన ఆయన.. తనలో దాగిఉన్న అద్భుతమైన చిత్రకళను వెలికితీశారు. ఈ క్రమంలో తాజాగా తాను వేసిన ఓ స్కెచ్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి బహుమతిగా ఇచ్చారు బ్రహ్మి. దీంతో ఈ చిత్రపటాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు బన్నీ. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని తన చేతులతో గీశారు బ్రహ్మానందం. పూజారి ఎంతో నిష్టగా పూజలు చేస్తున్నట్టుగా ఏడు కొండల స్వామిని ఆర్ట్‌గా వేశారు. పంచె కట్టుకొని చక్కగా పెన్సిల్‌తో బ్రహ్మానందం స్కెచ్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ బొమ్మ‌ల‌తో క్యాలెండ‌ర్‌ను ముద్రించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆర్ట్‌ని అల్లు అర్జున్‌కి గిఫ్ట్‌గా పంపించారు ఈ హాస్య బ్రహ్మ. దీంతో ఈ ఆర్ట్, బ్రహ్మానందం వేసిన చిత్రపటాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకెంతో ఇష్టమైన బ్రహ్మానందం గారి నుంచి ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ''నాకు వచ్చిన గిప్ట్‌లన్నింటిలో ఇదే గొప్పది. 45 రోజలు కఠిన శ్రమ.. చేతితో వేసిన ఈ పెన్సిల్ స్కెచ్ ఎంతో బాగుంది. ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. దీంతో బన్నీ అభిమానులు ఇది చూసి ఖుషీ అవుతున్నారు. గతంలో అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా కూడా బ్రహ్మానందం తన ప్రత్యేకమైన చిత్రకళను బయటపెట్టారు. ''ఆంజ‌నేయుని ఆనంద భాష్పాలు'' అని పేర్కొంటూ శ్రీ రాముడిని ఆలింగనం చేసుకుని ఆంజనేయుడు తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తున్న అద్భుత చిత్రాన్ని గీసి ఆడియన్స్‌ని ఫిదా చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aX3krI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...