Tuesday, 19 January 2021

‘క్రాక్’కు మెగా ప్రశంస.. ఇది కమర్షియల్ సక్సెస్‌కు నిదర్శనమట!

‘క్రాక్’ సినిమాతో మాస్ మహారాజా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా ‘క్రాక్’ నిలిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ సినిమాల నుంచి పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అందుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లిపోయిన ‘క్రాక్’.. థియేటర్లు తగ్గించినా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రవితేజ కెరీర్‌లో మరో అతిపెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది. ఇప్పటికే ‘క్రాక్’ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మెగాస్టార్ కూడా చేరారు. ‘క్రాక్’ సినిమాను తాజాగా వీక్షించిన చిరంజీవి.. చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనిని ఇంటికి పిలుపించుకుని అభినందించారు. సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. చిరంజీవిని తాను కలిసిన ఫొటోను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు గోపీచంద్. ‘‘ఈరోజు నాకు మెగాడే. మెగాస్టార్ నుండి ప్రశంసలు అందుకోవడం అంటే కమర్షియల్ సక్సెస్‌కు నిదర్శనం. చిరంజీవి గారితో ఇంటరాక్షన్ ఎప్పుడూ ఒక పాఠమే. ఈ చిన్న మీటింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని గోపీచంద్ మలినేని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది గోపీచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం. గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాలు వీరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూడో చిత్రంతో హ్యాట్రిక్ కొట్టారు. నిజ జీవిత క్యారెక్టర్లు, ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగిటివ్ రోల్స్ పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bUObb9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...