Saturday, 16 January 2021

ముంబైలో సమంత.. ప్రియమణితో కలిసి ప్రమోషన్స్‌తో బిజీ బిజీ!

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతేడాది సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ’ సీజన్ 2 రూపొందింది. ఇందులో స్టార్ హీరోయిన్ అక్కినేని కూడా నటించడంతో తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేమికుల్లోనూ ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేందుకు ఈనెల 19న ట్రైలర్‌ను కూడా తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించిన మనోజ్ బాజ్‌పాయి, సమంత, ప్రియమణి.. దర్శకులు రాజ్ అండ్ డీకేతో కలిసి ముంబైలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిన్నటి నుంచి ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రచారం కల్పించే పనిలో ఉంది ఈ టీమ్. ముంబైలోని జుహులో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ జేడబ్ల్యూ మారియట్‌లో మీడియాతో ముచ్చటించింది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 టీమ్. ఈరోజు కూడా ఇదే హోటల్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న గోధుమ రంగు పొడవాటి దుస్తుల్లో మెరిసిన సమంత.. నేడు లేత నీలి రంగులోని డెనిమ్ ఫ్రాక్‌లో షేక్ చేశారు. మరోవైపు, ప్రియమణి ప్రియమణి తెలుపు రంగు లాంగ్ డ్రెస్‌లో మెరిశారు. ఆమె డ్రెస్‌పై జిగ్ జాగ్ డిజైన్ కూడా ఉంది. కాగా, మనోజ్ బాజ్‌పాయి తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథ’ చిత్రంతో మనోజ్ బాజ్‌పాయి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే, ‘హ్యాపీ’ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మనోజ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరవాత పవన్ కళ్యాణ్ ‘పులి’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ చిత్రాల్లో మనోజ్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39BTMQT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...