సోనూసూద్.. లాక్‌డౌన్ వేళ సినిమాలతో గాక స్వచ్ఛమైన మనసుతో జనం నోళ్ళలో నానిన సినీ నటుడు. కరోనా విలయతాండవం చేస్తున్న కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ నేనున్నా అంటూ వారికి సాయం చేశారు సోనూసూద్. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్ధికంగా కృంగిపోయి ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలిచిన ఆయన ఇప్పటికీ అదే బాటలో వెళ్తున్నారు. రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్న సోనూ.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని మరీ వీలైనంత సాయాన్ని అందిస్తున్న ఈ వీడియోలో టైలర్‌గా కనిపించారు. తాను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ సమయంలో కొంచెం గ్యాప్ దొరకడంతో ఈ పని చేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఉపయోగించే టైలరింగ్ మిషన్‌పై బట్టలు కుట్టిన సోనూసూద్ ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "సోనూసూద్ టైలర్ షాప్.. ఇక్కడ ఉచితంగా బట్టలు కుట్టబడును. మీ ప్యాంట్ కాస్త నిక్కరుగా మారే అవకాశాలున్నాయి" అంటూ తమాషాగా తనపై తానే కామెంట్స్ చేసుకోవడం ఫన్నీగా అనిపిస్తోంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. గత 20 ఏళ్లుగా తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తూ తనదైన నటనతో మెప్పిస్తున్న సోనూసూద్ ఇటీవలే విడుదలైన 'అల్లుడు అదుర్స్' మూవీలో కీలకపాత్ర పోషించారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో సోనూసూద్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LTDiLN
v
No comments:
Post a Comment