Wednesday, 13 January 2021

అంచనాలు పెంచేస్తోన్న ‘ఉప్పెన’ టీజర్.. హీరోని చంపేశారా!?

పంజా వైష్ణవ్ తేజ్‌, కృతిశెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. అయితే, ఈ సినిమా నుంచి విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 161 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాగా, ఇప్పుడు భోగి పండుగ సందర్భంగా ‘ఉప్పెన’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టీజర్ కూడా చాలా బాగుంది. ‘‘దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది. కానీ, ఎవరి కోసం పుట్టామో నా సిన్నప్పుడే తెలిసిపోయింది’’ అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే మాటలతో టీజర్ మొదలైంది. వైష్ణవ్ తేజ్ వాయస్ మంచి బేస్‌తో చాలా బాగుంది. నిజం చెప్పాలంటే సాయి తేజ్ కన్నా గంభీరంగా ఉంది. ‘‘మనిద్దరి మధ్యన ప్రేమెందుకని ప్రేమనే పక్కన పెట్టేశా’’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగు కూడా ఆకట్టుకుంటోంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ టీజర్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. షామ్‌ద‌త్ సైనుద్దీన్‌ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీజర్ ఆఖరిలో హీరో గాయాలతో సముద్రం ఒడ్డున జీవచ్చవంలా పడి ఉన్నాడు. అంటే, కొంప దీసి దర్శకుడు హీరోని చంపేశారా? అనే అనుమానం కలుగుతోంది. మరి ఈ సంగతి సినిమాలోనే చూడాలి. కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులనూ ఈ సినిమా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీని ప్రకటించడమే తరువాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38F5kUb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...