Thursday, 7 January 2021

విజయ్ దేవరకొండ సరసన బన్నీ.. హవా మామూలుగా లేదు!

సినీ తారలు.. వారి అభిమానుల మధ్య సోషల్ మీడియా ఒక మంచి వారధిలా మారింది. హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తమ సినిమాలకు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే అభిమానులతో పంచుకుంటున్నారు. అందుకే, ప్రతి ఒక్కరూ తమ అభిమాన హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ తారలకు ఫాలోవర్లు ఎక్కువగా ఉంటున్నారు. సినిమా హీరోల్లో దక్షిణాది నుంచి విజయ్ దేవరకొండకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం 10.2 మిలియన్ ఫాలోవర్లు విజయ్ సొంతం. అయితే, ఇప్పుడు ఈయన సరసన స్టైలిష్ స్టార్ కూడా చేరారు. ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోవర్లు మార్కును అందుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా బన్నీకి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, బన్నీ సైతం తన ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. నా శక్తిగా మీరు ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాలు నిజంగా నన్ను హత్తుకున్నాయి’’ అని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే, బుట్ట బొమ్మ పాట ట్యూన్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తన పాత ఇన్‌స్టా పోస్టులు పొందుపరిచారు బన్నీ. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39fF3KW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...