Thursday, 7 January 2021

మోనాల్ హైదరాబాద్‌లోనే సెటిల్.. ఇంటి కోసం వేట!!

బిగ్ బాస్ రియాలిటీ షో వచ్చిన తరవాత చాలా మంది చిన్న ఆర్టిస్టులు పిచ్చ పాపులారిటీ సంపాదించారు. సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా రాని పాపులారిటీ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిందంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్.. వీళ్లు సినిమాల కన్నా బిగ్ బాస్ ద్వారానే అభిమాన గణాన్ని సంపాదించుకోగలిగారు. విజేతలు మాత్రమే కాదు.. బిగ్ బాస్‌లో పాల్గొన్న కొంత మంది సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ వాడుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. కూడా ఇదే చేస్తున్నారట. మోనాల్ గజ్జర్‌కు సినిమాలతో రాని గుర్తింపు బిగ్‌ బాస్‌తో వచ్చింది‌. ఓట్లు, గేమ్‌తో కాకుండా గ్లామర్‌తో మోనాల్ బిగ్‌ బాస్‌లో కొనసాగారనే విమర్శలు ఉన్నాయి. అయితే, అఖిల్‌తో లవ్ గేమ్ ఆడి షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మోనాల్. మొదట్లో గ్లామర్‌తో నెట్టికొచ్చినా ఆఖరులో మాత్రం మోనాల్ తన టాలెంట్‌ను చూపించింది. ఏడవడమే కాదు గేమ్ కూడా ఆడగలను అని నిరూపించింది. దీంతో ఆమెకు కూడా ఫ్యాన్స్ బాగా పెరిగారు. బిగ్ బాస్ 4 నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు చాలా మంది ప్రస్తుతం టీవీ, సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలాగే మోనాల్‌కు కూడా అవకాశాలు వస్తున్నాయి. మా టీవీలో ఓంకార్ నిర్వహిస్తోన్న డాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న మోనాల్.. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయట. అందుకే, తన సొంతూరు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లకుండా హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోవాలని మోనాల్ నిర్ణయించుకున్నారట. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల ఆఫర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్‌లోనే ఉండి వాటిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారట. కాబట్టి, హైదరాబాద్‌లో ఇల్లు కొనే ఆలోచనలో మోనాల్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కొత్తింటి వేటలో ఉన్నారని అంటున్నారు. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె ఇల్లు కొనబోతున్నారని ఫిలిం నగర్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39aOsUd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...