Sunday, 24 January 2021

ప్రేయసిని పరిణయమాడిన వరుణ్ ధావన్.. ఘనంగా వివాహ వేడుక

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దలాల్‌ను పరిణయమాడారు. వీరి వివాహ వేడుక ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నటాషాను పెళ్లాడిన ఫొటోలను వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో వరుణ్, నటాషా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ వివాహం గతేడాది మే నెలలో జరగాలి. కొవిడ్-19 పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. నటాషా దలాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. వరుణ్, నటాషా స్కూల్ డేస్ నుంచే ఒకరికొకరు పరిచయం. ఆ తరవాత వీరు ప్రేమికులుగా మారారు. అయినప్పటికీ తమ రిలేషన్‌షిప్‌ మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. వరుణ్ ధావన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తరవాత వీరి మధ్య సంబంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఇటీవల కరీనా కపూర్ ఖాన్ షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో పాల్గొన్నా వరుణ్ ధావన్.. నటాషా దలాల్‌తో తన ప్రేమ ప్రయాణం గురించి పంచుకున్నారు. తన ప్రేమను నటాషా మూడు నాలుగు సార్లు రిజెక్ట్ చేసిందని.. మొత్తానికి అంగీకరించి తన జీవితంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. నటాషాతో తన పరిచయం గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘నటాషాను నేను 6వ తరగతిలో కలిశాను. 12వ తరగతి వరకు మేమిద్దం స్నేహితులం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆమెను మొదటిసారి చూసిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. మనేక్‌జీ కూపర్ స్కూల్‌లో ఉన్నప్పుడు బాస్కెట్ బాల్ కోర్టు వద్ద ఆమెను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను. ఆ తరవాత మూడు నాలుగు సార్లు నా ప్రేమను ఆమె రిజెక్ట్ చేసింది. కానీ నేను వదల్లేదు’’ అని వరుణ్ చెప్పుకొచ్చారు. కాగా, వరుణ్-నటాషా వివాహం గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో నానుతోంది. ఈరోజు బాలీవుడ్ మీడియా అంతా అలీబాగ్‌లోనే ఉంది. నటాషాను పెళ్లాడిన వెంటనే రిసార్ట్స్ బయట మీడియా ప్రతినిధుల కోసం స్వీట్స్ పంపారు వరుణ్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వరుణ్ హీరోగా ఇటీవల ‘కూలి నెం.1’ సినిమా వచ్చింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గతంలో గోవింద హీరోగా వచ్చిన ‘కూలి నెం.1’కు ఇది రీమేక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qSDr1b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...