Sunday, 24 January 2021

ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసిన హీరో నిఖిల్.. ధర తెలిస్తే షాకే!

యంగ్ హీరో ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారుతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ.. ‘అర్జున్ సురవరం’ విజయం సాధించడంతో నాకు నేను దీన్ని బహుబతిగా ఇచ్చుకున్నాను. కొవిడ్ వల్ల ఇది నా దగ్గరకు రావడం కాస్త ఆలస్యమైంది’’ అని పేర్కొన్నారు నిఖిల్. ఇక నిఖిల్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ధర విషయానికి వస్తే.. ఇండియాలో ఈ మోడల్‌లో 10 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల మధ్యలో ఉన్నాయి. హై-ఎండ్ మోడల్ హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.2.10 కోట్లు. మరి, నిఖిల్ కొనుగోలు చేసిన వేరియంట్ ఏదో తెలీదు కానీ.. ధర మాత్రం కోటి రూపాయలు పైమాటే. మొత్తం మీద ‘అర్జున్ సురవరం’ ఇచ్చిన విజయంతో ఖరీదైన లగ్జరీ కారుకి నిఖిల్ యజమాని అయ్యారు. ‘హ్యాపీడేస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్.. ఆ తరవాత సోలో హీరోగా ఎదిగారు. ‘యువత’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నిఖిల్. ‘హ్యాపీడేస్’ ద్వారా హీరోలుగా పరిచయమైన వారిలో ఒక్క నిఖిల్ మాత్రమే నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘కార్తికేయ’కు సీక్వెల్ ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘18 పేజస్’ అనే సినిమా కూడా చేస్తున్నారు నిఖిల్. ఇదిలా ఉంటే, కిందటేడాది లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటివాడయ్యారు హీరో నిఖిల్. తాను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడారు. వీరి వివాహం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. మొత్తం మీద ‘అర్జున్ సురవరం’ సినిమా నిఖిల్‌కు బాగా కలిసొచ్చినట్టుంది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు ఖరీదైన కారుకు యజమాని అయ్యారు. నిఖిల్ మరిన్ని విజయాలు అందుకోవాలని.. మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39dbefB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...