ఆహా వేదికపై హోస్ట్‌గా చేస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ షోలో మొదటి గెస్టుగా విజయ్ దేవరకొండ, ఆ తర్వాత రానా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు తెగ సందడి చేశారు. చిరంజీవితో చేసిన ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రిస్మస్ కానుకగా ప్రసారమైన ఈ మెగా ఎపిసోడ్‌లో ఒకవేళ టైమ్ వెనక్కి వెళితే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్నపై ఆసక్తికర సమాధానమిచ్చారు మెగాస్టార్ . ప్రస్తుతం ఈ ఆసక్తికర క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలాన్ని రివైండ్ చేసి ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటే దేన్ని మారుస్తారు? అని సమంత ప్రశ్నించగా.. ''ఒకవేళ నిజంగానే అలాంటి అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చైనాలో కరోనా వైరస్ లీక్ అయిన బిల్డింగ్‌ను భూస్థాపితం చేసి ఆ వైరస్‌ను బయటకు రాకుండా చేయాలనేది నా కోరిక'' అని చెప్పారు చిరంజీవి. మెగాస్టార్ చెప్పిన ఈ మాట దేశ విదేశాల్లోని ఆయన అభిమానులను ఆకర్షించింది. ఇంకా ఈ ఎపిసోడ్‌లో తనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు, సీక్రెట్స్ ఆయన బయటపెట్టారు. ఇక చిరంజీవి కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించనున్నారు. చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ కాగానే 'లూసిఫర్' రిమేక్‌లో ఆయన నటించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L3bZOT
v
No comments:
Post a Comment