పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్ వచ్చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 6:03 గంటలకు ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించారు. మన నేటివిటీకి తగ్గట్టు కథలో స్వల్ప మార్పులు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించారు. పవన్ కళ్యాణ్‌కు జంటగా శ్రుతిహాసన్ నటించారు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా విడుదల చేసిన వీరిద్దరి పోస్టర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. బోనీ కపూర్ సమర్పణలో బేవ్యూ ప్రొడక్షన్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తు్న్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdizT5
v
No comments:
Post a Comment