Friday, 22 January 2021

చంపేస్తామంటూ దిశా పటానికి బెదిరింపు కాల్స్.. ఎవ్వరూ కాపాడలేరంటూ పోలీసులకు ఫోన్! ఇదీ మ్యాటర్

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొందరు దుండగులు ఫేక్ కాల్స్ చేస్తుండటం తరచుగా చూస్తున్నాం. మీ ఇంటి పరిసరాల్లో బాంబు పెట్టాం, చంపేస్తాం అంటూ ఇటీవలి కాలంలో సెలబ్రిటీల్లో వణుకు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఆగంత‌కులు. తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్, విజయ్ ఇళ్లలో బాంబులు పెట్టామంటూ బెదిరింపు కాల్స్ రావడం, ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అవి ఫేక్ కాల్స్ అని నిర్దారించడం జరిగాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విషయంలోనూ ఇదే రిపీట్ కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దిశా పటానికి గత కొన్ని రోజులుగా కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ ఫోన్ కాల్స్‌లో చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే వారు ఈ బెదిరింపులు చేస్తున్న‌ట్లు బీ టౌన్ వర్గాల నుంచి సమాచారం. దిశా పటానికి మాత్ర‌మే కాకుండా ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌కు కూడా సదరు ఆగంతకులు ఫోన్ చేస్తూ దిశా పటాని చంపేస్తామని, ఎవ్వరూ కాపాడలేరని చెబుతున్నారట. దీంతో ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అస‌లు ఈ కాల్ నిజ‌మైనదేనా, లేక ఆమెను బెదిరించ‌డానికి ఎవరైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై విచార‌ణ చేస్తున్నారు. 'లోఫ‌ర్' బ్యూటీగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న 'రాధే' సినిమా చేస్తున్న ఆమె.. ఇటీవలే మాల్దీవుల‌కు వెళ్లి అక్కడ బికినీలో ప‌లు ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాను హీటెక్కిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y6d3UY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...