Friday, 22 January 2021

‘రైడర్’ టీజర్: ఎగరేసి కుమ్ముతున్న యువరాజా.. వామ్మో!

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్ నాలుగేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యారు. ‘జాగ్వార్’ సినిమాతో కన్నడ, తెలుగు ప్రేక్షకులకు ఒకేసారి పరిచయమయ్యారు. అయితే, ఈ సినిమా కన్నడలో పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ తెలుగు ఆడియన్స్‌కి నిఖిల్ కుమార్ కనిపించలేదు. ఇప్పుడు నాలుగేళ్ల విరామం తరవాత మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. నిఖిల్ కుమార్, కశ్మీరా పరదేశి జంటగా నటించిన కన్నడ చిత్రం ‘రైడర్’. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా ‘రైడర్’కు దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర మనోహరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నేడు (జనవరి 22న) నిఖిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘రైడర్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో కేవలం నిఖిల్ కుమార్ యాక్షన్‌ను మాత్రమే చూపించారు. నిఖిల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది ఈ టీజర్. విలన్స్‌ని ఎగరేసి కుమ్ముతున్నాడు హీరో. స్టంట్ మాస్టర్ డాక్టర్ రవి వర్మ కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఉన్నాయి. అయితే, బాస్కెట్ బాల్ కోర్టు సీన్.. ఒక ఫైట్ సీన్‌ను కలిపి ఈ టీజర్‌ను కట్ చేశారు. మరీ అంత ఆసక్తికరంగా అయితే లేదు. రాబోయే ట్రైలర్‌లో అయినా ఆసక్తికర అంశాలు ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qJQIJm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...