Thursday, 28 January 2021

జులైలో రింగ్‌లోకి ‘గని’.. బాక్సు బద్దలే!

మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్లపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 10వ చిత్రంగా రూపొందుతోన్న ‘గని’ టైటిల్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19న ప్రటికంచారు. మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మెగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే, ‘గని’ విడుదల తేదీని నిర్మాతలు గురువారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె ఈమె. అలాగే, కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపించే వరుణ్ తేజ్.. ‘గని’ ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ద్వారా తనలోని విలక్షణ నటుడిని చూపించారు. ఈ చిత్రం తరవాత వస్తోన్న సినిమా కావడంతో ‘గని’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సరికొత్త మేకోవర్, కండలు తిరిగిన శరీరంతో వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా జార్జ్ సి. విలియ‌మ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kAkHi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...