Monday, 25 January 2021

రజినీకాంత్ దీపావళి ట్రీట్.. ‘అన్నాత్తే’ వచ్చేస్తున్నాడు!

సూపర్ స్టార్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నారు. ఆయన హీరోగా ప్రస్తుతం రూపొందుతోన్న ‘అన్నాత్తే’ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలవుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోమవారం విడుదల తేదీని ప్రకటించింది. నిజానికి ఈ మూవీ గతేడాది మధ్యస్తంలో ప్రేక్షకుల ముందుకు రావాలి. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తికాలేదు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్ మొదలైనప్పటికీ సజావుగా సాగలేదు. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ‘అన్నాత్తే’ చిత్ర బృందంలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి తోడు రజినీకాంత్‌ రక్తపోటు సమస్యతో హాస్పిటల్‌లో చేరడంలో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం రజినీకాంత్ విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. కాగా, ‘అన్నాత్తే’ రజినీకాంత్‌కు 168వ సినిమా. శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌ అయ్యారు. ఇప్పుడు రజినీకాంత్‌తో ‘అన్నాత్తే’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qIicPw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...