Sunday, 10 January 2021

కోహ్లీ, సచిన్ చాలా క్లోజ్.. ఐదేళ్ల క్రితమే అనుమానం వచ్చింది.. నర్సింగ్ యాదవ్ మృతిపై ఆయన భార్య రియాక్షన్

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన యాసతో అలరించిన ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్ చికిత్స పొందుతూ 2020 డిసెంబర్ 31న మరణించారు. అయితే ఆయన మరణం చాలా మందిని కొంత కన్ఫ్యూజన్‌లో పడేసింది. దీంతో తాజాగా ఆ విషయమై చిత్ర ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలతో పాటు ఆయన పరిచయాలు ఇలా పలు విషయాలు చెప్పుకొచ్చారు. చిత్రసీమకు ఎన్నో విషాదాలు మిగిల్చిన 2020 సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31న నర్సింగ్ యాదవ్ కన్నుమూయడం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కలచివేసింది. ఈ క్రమంలో ఆయన మరణానికి గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటివన్నీ అబద్దాలే అని ఆయన సతీమణి చిత్ర యాదవ్ మాటల ద్వారా స్పష్టమైంది. భర్త నర్సింగ్ యాదవ్ మరణం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసినట్లు చెబుతూ చిత్ర తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి క్షణం, రోజుకు లక్షసార్లు తన పేరును పిలిచేవారని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి గారంటే ఆయనకు చాలా ఇష్టమని, అలాగే హీరోయిన్లలో సౌందర్య అంటే ఆయనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. ఆయన మరణించారని తెలియగానే సినీ ప్రముఖులంతా ఫోన్ చేశారని, ముఖ్యంగా జీవిత రాజశేఖర్ గారు ప్రతిక్షణం అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని చిత్ర చెప్పారు. క్రికెటర్లలో సచిన్, కోహ్లీ ఆయనతో చాలా క్లోజ్‌గా ఉండేవారని చిత్ర తెలిపారు. ఒకసారి ఇండియన్ టీమ్ క్రికెట్ అంతా కూడా సుల్తాన్ బజార్ లాంటి ఏరియాలో యాడ్ షూటింగ్ కు వస్తే ఆయనే దగ్గరుండి అక్కడ పబ్లిక్‌ను మ్యానేజ్ చేశారని, అది ఓ డ్రీమ్ అని చెప్పుకొచ్చారు. సచిన్ అయితే తమ ఇంటికి కూడా వచ్చారని అన్నారు. ఇక నర్సింగ్ యాదవ్ మరణానికి గల కారణాలపై స్పందించిన చిత్ర.. అనారోగ్యం కారణంగానే నర్సింగ్ యాదవ్ మరణించారని తెలిపారు. షూటింగ్స్ బిజీతో సమయానికి భోజనం, సరైన నిద్ర కూడా ఉండకపోయేదని అన్నారు. ఐదేళ్ల క్రితమే ఆయన ఆరోగ్యంపై అనుమానం వచ్చిందని, అయినా కూడా రెండేళ్ల వరకు సినిమాలతో బిజిగానే ఉన్న ఆయన ఇంత సడన్‌గా ఈ లోకం విడిచి వెళతారని అనుకోలేదంటూ ఆవేదన చెందారు. మార్చి నెల నుంచి ఆయన ఆరోగ్యం కొంచెం సీరియస్ అవుతూ వచ్చి డిసెంబర్ చివరిరోజు రెండు సార్లు వెంటనే హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు వదిలారని చిత్ర తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XtqbmT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...