Monday, 25 January 2021

న‌వీన్‌ చంద్ర హీరోగా కొత్త సినిమా.. ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయ‌మై టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు న‌వీన్ చంద్ర. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తున్నారు. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్‌కు తలపడే యంగ్ విలన్‌గా నటించారు. ప్రస్తుతం మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో న‌టిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా ‘సూపర్ ఓవర్’ అనే వెబ్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. న‌వీన్ చంద్ర హీరోగా అర‌వింద్ ద‌ర్శక‌త్వంలో డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఒక మూవీ తెర‌కెక్కనుంది. ఈ సినిమాను సోమవారం ప్రకటించారు. శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపార‌వేత్త జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే సినిమాను ప్రారంభించి ఫిబ్రవరి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరపనున్నారు. జిబ్రాన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి పి.జి.ముత్తయ్య సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరించనున్నారు. సిద్దార్ధ్ ఎడిటింగ్ బాధ్యత‌లు నిర్వహించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్‌, స్మిర్తి వెంక‌ట్‌, ఎమ్‌.గోపి, పూజా రామ‌చంద్రన్‌, స‌త్యం రాజేష్‌, సిరి, న‌వీనా రెడ్డి, సుద‌ర్శన్‌, ర‌ఘుబాబు ముఖ్య పాత్రల్లో న‌టించనున్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తిచేశారు. రాజారవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నవీన్ చంద్ర మూడు మొక్కలు నాటారు. అలాగే, ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా తమిళ హీరో ధనుష్, ‘భానుమతి అండ్ రామకృష్ణ’ ఫేమ్ సలోనీ లూత్రా, రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరిని నామినేట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3phoEN6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...