Wednesday, 20 January 2021

సంపూర్ణేష్ బాబు సెన్సేషన్: ‘ఆర్య’ కొరియోగ్రాఫర్‌తో ‘బజారు రౌడీ’

‘హృద‌య‌ కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ లాంటి విచిత్రమైన టైటిల్స్‌లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో బర్నింగ్ స్టార్ . ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘బ‌జారు రౌడీ’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌లే క్లైమాక్స్ చిత్రీకరణ జరిగింది. భారీ తారాగాణంతో భారీ వ్యయంతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశారు. అంతేకాదు, టాలీవుడ్ క్రేజీ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్‌ ర‌క్షిత్ సార‌ధ్యంలో ఒక పాటను చిత్రీక‌రించారు. ఇటీవ‌లే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సారధి స్టూడియోలో మొదలయ్యాయి. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ద‌ర్శకుడు వసంత నాగేశ్వరావు ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ‘ఆర్య’ చిత్రంలో బన్నీతో మూన్ వాక్ స్టెప్ వేయించి యూత్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకున్న కొరియోగ్రాఫ‌ర్ నిక్సన్ మాస్టర్ సార‌ధ్యంలో హీరోహీరోయిన్లపై ఇటీవల ఒక పాటను చిత్రీకరించారు. గుంటూరు జిల్లా కొండ‌వీడు గ్రామ అందాల మ‌ధ్యలో హీరో సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వరి వ‌ద్దిల‌పై ఈ పాట చిత్రీకరణ జరిగింది. రేపు థియేట‌ర్స్ వ‌చ్చే ప్రేక్షకులకు ఈ పాట పండ‌గలా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మ‌హేశ్వరి వద్ది నటిస్తున్నారు. ఫిబ్రవ‌రిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ ప్లస్ పాయింట్ కానుంది. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ‘బజారు రౌడీ’ సినిమాకు ఎ. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తు్న్నారు. ఈ చిత్రంలో ఇంకా నాగినీడు, షాయాజీ షిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి, క‌త్తి మ‌హేష్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XW0Thw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...