Wednesday, 20 January 2021

‘పిట్ట కథలు’ టీజర్: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు మూవీ.. కాస్త బోల్డ్, కాస్త ఎమోషనల్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఒరిజినల్ తెలుగు చిత్రం ‘పిట్ట కథలు’ను ప్రకటించింది. నాలుగు భాగాలుగా ఉన్న ఈ ఆంథాలజీ మూవీని నలుగురు తెలుగు దర్శకులు రూపొందించారు. నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలోని నాలుగు భాగాలకు దర్శకత్వం వహించారు. సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్ట కథలు అని పిలుస్తాం. అలాగే, ఈ ‘పిట్ట కథలు’లోని నాలుగు కథలు నిర్దిష్ట భావాలు ఉన్న నలుగురు మహిళల గురించి చెబుతాయి. ఈ నాలుగు పాత్రల్లో శ్రుతిహాసన్, మంచు లక్ష్మి, అమలాపాల్, ఈషా రెబ్బా నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే కీలక పాత్రలు పోషించారు. ఆర్ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యూనీకార్న్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రోనీ స్క్రూవాలా, ఆశి దువాసారా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సినిమా ఆసక్తికరంగా ఉండనుందని అర్థమవుతోంది. నలుగురు ప్రముఖ దర్శకులు, ఉత్తమ తారాగణం ఈ సినిమా క్రేజ్‌ను పెంచుతున్నాయి. టీజర్‌లో కొన్ని సన్నివేశాలు బోల్డ్‌గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో ఇవి కామన్ అనుకోండి. అయితే, నాలుగు కథల మిళితం అంటేనే కాస్త అనుమానం కలుగుతోంది. ఇప్పటికే ఇలాంటి సినిమాలు వేరే ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చాయి. ‘ఆహా’లో విడుదలైన ‘జోహార్’, ‘మెట్రోకథలు’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్ తమిళ్ ఒరిజినల్ ‘పావ కథైగళ్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది కూడా నాలుగు కథల మిళితమే. దీనికి సుధ కొంగర, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. చూద్దాం.. ఈ ‘పిట్ట కథలు’ ఎలా ఉంటుందో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qy0aPV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...