Monday, 11 January 2021

చావు కబురు చల్లగా టీజర్: నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడతా అంటూ కార్తికేయకు లావణ్య వార్నింగ్

RX 100 మూవీతో కెమెరా ముందుకొచ్చి.. చేసింది కొన్ని సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో . యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విలక్షణ కథలతో అలరిస్తున్న ఆయన లేటెస్ట్ మూవీ 'చావు కబురు చల్లగా'. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో కథ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 50 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ వీడియోలో హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలను మాత్రమే చూపిస్తూ సిస్టర్ డైలాగ్‌తో ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పకనే చెప్పేశారు. మల్లిక రోల్‌లో నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నారు. 'మనం ప్రేమించిన అమ్మాయి మనకు తప్ప మిగిలిన వాళ్లందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో సూపర్ ఎహె..' అని కార్తికేయ చెప్పగా.. 'నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీక్కూడా నీకు సిస్టర్‌నే అవుతా' అని లావణ్య వార్నింగ్ ఇస్తుండటం ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'చావు కబురు చల్లగా' సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ‌బన్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తుండగా.. కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కార్తికేయ ఊరమాస్ లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oADBJE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...