Tuesday, 29 December 2020

Vijay: మాస్ట‌ర్ విడుదల తేదీ ఫిక్స్.. బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అయిన విజయ్

కరోనా కారణంగా మూతపడిన థియేటర్ గేట్లు ఇటీవలే తెరుచుకున్నాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రేక్షకులు లేక సినిమా హాల్స్ బోసిపోయాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యారు తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి . తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ '' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ 'మాస్టర్' థియేటర్స్‌లో అడుగు పెట్టేస్తున్నారు. మాస్టర్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో జనవరి13న విడుదల చేస్తున్నట్లు తెలిపిన దర్శకనిర్మాతలు.. హిందీలో మాత్రం జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విజయ్ ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి చిన్నపిల్లల స్కూల్ మాస్టర్‌గా కనిపించనున్నారని టాక్. ఇక మరో తమిళ స్టార్ హీరో విలన్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. 'ఖైదీ' చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'మాస్టర్' మూవీలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ర‌న్‌టైమ్ ఏకంగా 178 నిమిషాల‌కు పైగా ఉందని తెలుస్తుండటం, లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న బిగ్గెస్ట్ మూవీ కావడంతో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. సో.. చూడాలి మరి ఈ సంక్రాంతికి విజయ్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rDZzxe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...