Saturday, 19 December 2020

Solo Brathuke So Better Trailer: ఆర్. నారాయణ మూర్తి ఫినిష్ టచ్ అదిరింది.. పాపం! తేజు ఫీలింగ్స్ చూస్తే..

మెగా మేనల్లుడు 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సగటు వ్యక్తికి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంతో ఆ అంచనాలను రెట్టింపు చేయాలనే టార్గెట్‌తో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 54 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో మొదట సాయి ధరమ్ తేజ్ కటౌట్ కాల్చుతున్న దృశ్యం చూపించి మెల్లగా ప్రేమ, పెళ్లి వైపు కెమెరా టర్న్ చేశారు. పెళ్లికి, పెళ్ళానికి దూరంగా ఉండాలంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతోంది. వెన్నెల కిషోర్, హీరోయిన్ నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్ పర్‌ఫార్‌మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఇక చివరగా.. ఆర్. నారాయణ మూర్తి ఫినిషింగ్ టచ్, అది చూసిన సాయి ధరమ్ తేజ్ ఫీలింగ్స్ చూపించి ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలాన్ని పెంచేశారు. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందిన 'సోలో బతుకే సో బెటర్' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మించారు. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ చివరకు వచ్చిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3apsWxe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...