Saturday, 5 December 2020

Samantha: 'జాంబీ రెడ్డి' టీజర్.. భగవంతుని సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం

విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ తానే అని తన మొదటి సినిమా 'అ!' తోనే నిరూపించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత 'కల్కి' రూపంలో మరో డిఫరెంట్ మూవీ రూపొందించారు. ఇక ఇప్పుడు త‌న మూడో సినిమాగా విభిన్న తరహాలో 'జాంబీ రెడ్డి' అనే మూవీ రూపొందిస్తున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఫస్ట్‌ బైట్‌ రూపంలో స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. కేవలం ఒకే ఒక్క నిమిషమున్న ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ''దైవం మనుష్య రూపేణ అనేది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం" అనే పవర్‌ఫుల్ డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌లో హైలైట్ అవుతున్నాయి. జాంబీలు మనుషులపై చేస్తున్న దాడి, కోవిడ్‌ ఇంజెక్షన్స్ చూపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. Also Read: యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అటు దైవ శక్తిని, ఇటు సైన్స్‌ని బాలెన్స్ చేస్తూ రూపొందించారని తెలుస్తోంది. ''హాలీవుడ్‌లో ఈ ర‌కం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్క‌డ న్యూయార్క్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఆ క‌థ జ‌రిగిన‌ట్లు చూపిస్తుంటారు. నేను క‌ర్నూలును బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాను'' అని అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చిత్రంలో తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్‌కర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gd82SK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...