Saturday, 5 December 2020

ప్రియుడి ఫొటో బయటపెడుతూ లవ్ కన్ఫర్మ్ చేసిన పాయల్.. కిస్సులు, హగ్గులంటూ బాయ్ ఫ్రెండ్ రచ్చ

కొందరు హీరోయిన్లకు ఎంత ప్రయత్నించినా రాణి గుర్తింపు ఇంకొందరు హీరోయిన్లకు రాత్రికి రాత్రే వచ్చేస్తుంది. అదే కోవలోకి చెందిన హీరోయిన్ . Rx 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని అత్యంత తక్కువ సమయంలో ఫేమస్ హీరోయిన్ అయింది. అంతేకాదు, నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. కాగా నేడు (డిసెంబర్ 5) తన పుట్టినరోజున తన లవర్‌ని పరిచయం చేసి సర్‌ప్రైజ్ చేసింది పాయల్. సినిమాల సంగతి అటుంచితే నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటూ తన అందాలతో ఆన్‌లైన్ వేదికలను వేడెక్కిస్తుంటుంది పాయల్. గత కొంతకాలంగా ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా తన ప్రియుడి ఫొటోను పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా పాయల్ ప్రేమ వ్యవహారంపై జనాల్లో చర్చలు నడుస్తుండగా ఈ పిక్ రిలీజ్ చేసి తాను ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది ఈ పంజాబీ పాప. ''హ్యాపీ బర్త్ డే మై లవ్'' అంటూ తన ప్రియుడు సౌరబ్ దింగ్రా పోస్ట్ చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ లవ్ ఎమోజీలను జత చేసింది. ఈ మేరకు సౌరబ్ దింగ్రాతో కలిసి తాను దిగిన ఓ పిక్ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి పాయల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: ఇకపోతే అవకాశాల పరంగా దూసుకుపోతున్న పాయల్ రాజ్‌పుత్.. కథ డిమాండ్ చేయాలే గానీ బోల్డ్ సీన్స్‌లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడనని అంటోంది. తనకు లిప్‌లాక్ సీన్స్ అంటే భయం లేదని, తన తల్లి వద్ద పర్మిషన్ తీసుకొనే అలాంటి సీన్స్ చేస్తానని చెప్పింది. ఇటీవలే ''వెంకీమామ, డిస్కో రాజా'' సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్, ఆ వెంటనే Rdxలవ్ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ చేసి మత్తెక్కించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ig0F0z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...