Monday, 21 December 2020

Rajamouli: సాయి ధరమ్ తేజ్ కోసం రాజమౌళి రెడీ.. మెగా మేనల్లుడికి బిగ్ సపోర్ట్

ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫస్ట్ లుక్ లాంచ్, ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఇలా ఎన్నో వేడుకలు చేస్తూ సందడి చేసేది సదరు చిత్రయూనిట్. అయితే ఇదంతా ఒకప్పుడు.. కరోనా మహమ్మారి రాకతో గత 8 నెలలుగా అలాంటి వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తిరిగి ఈ మధ్యనే షూటింగ్స్ ప్రారంభం కావడం, థియేటర్స్ ఓపెన్ కావడంతో మెల్లగా మళ్ళీ సినీ సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ బరిలో దిగుతున్న సాయి ధరమ్ తేజ్‌కి దర్శక ధీరుడు సపోర్ట్ అందిందని టాక్. నిజానికి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 25వ తేదీన థియేటర్స్ లోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చేయనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిందట చిత్రయూనిట్. దీనికి ఆయన కూడా ఓకే అనేశారని తెలిసింది. ఈ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్. ప్రసాద్‌తో రాజమౌళికి మంచి స్నేహబంధం ఉంది. అందుకే అడిగిన వెంటనే జక్కన్న రెడీ అన్నారని సమాచారం. ఈ ఈవెంట్ డిసెంబర్ 23వ తేదీన జరగనుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' అనే డిఫరెంట్ స్టోరీని నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. లాక్‌డౌన్, థియేటర్స్ రీ ఓపెన్ తర్వాత అత్యధిక సెంటర్లలో రిలీజ్ కాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా రాజమౌళి సపోర్ట్ దొరికిందని తెలుస్తుండటం సాయి ధరమ్ తేజ్ అభిమానులను హుషారెత్తిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h4zkvj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...