తెలుగు తెరపై హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్న .. ప్రస్తుతం విలక్షణ పాత్రలను ఓకే చేస్తూ సత్తా చాటుతున్నారు. సినిమా ఏదైనా తన మార్క్ కనిపించే పాత్రను ఎంచుకొని అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న కొత్త సినిమా . ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ అనేది ఫుల్‌ఫామ్. రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై ఎల్.దామోదర్ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, చైల్డ్ ఆర్టిస్ట్ సహశ్రిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన చిత్రయూనిట్ ఒక్కొక్కటిగా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన జగపతి బాబు లుక్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ FCUK సినిమాలో అమ్ము అభిరామి ఉమా పాత్రలో నటిస్తోంది. తమిళంలో దనుష్ సరసన 'అసురన్' సినిమాలో నటించి సినీ గడప తొక్కిన అమ్ము.. తెలుగులో ఈ సినిమాతో ఆరంగేట్రం చేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో చేతిలో తెల్లకోటు, స్టెతస్కోపుతో అమ్ము కనిపించింది. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే అమ్ము అభిరామి ఇందులో డాక్టర్‌గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. చిత్రంలో ఉమా పాత్ర చాలా రొమాంటిక్‌గా ఉండటమే గాక చాలా కీలకం అని తెలుస్తోంది. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aOjGTK
v
No comments:
Post a Comment