హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్న ఆయన మెగాస్టార్‌ని ఎందుకు కలిశాను తర్వాత చెబుతానని తెలిపారు. ‘ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాను. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు ఎన్నో ప్రశ్నలు సంధించి.. సమాధానం రాబట్టుకునే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఆ సమాధానాలతో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారో.. అనే విషయంలో అస్సలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు.’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. Also Read: అయితే మంచు విష్ణు.. చిరంజీవిని ఎందుకు కలిశారన్న దానిపై టాలీవుడ్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌కు చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే కలిశారని కొందరు, ‘లూసిఫర్’ రీమేక్‌లో మంచు విష్ణు కీలక పాత్రలో ఉందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి కలయికకు కారణమేంటో ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. Also Read: హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’లో మంచు విష్ణు, రూహీసింగ్ జంటగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్.. విష్ణుకి సోదరిగా కనిపించనుంది. సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు మోహన్ రాజ్‌తో ‘లూసిఫర్’ రీమేక్ చేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mGpNM8
v
No comments:
Post a Comment