Tuesday, 22 December 2020

‘బిగ్‌బాస్’ జీవిత పాఠాలు నేర్పింది.. వాళ్లకు నాపై ఇంత ప్రేమ ఉందా: అభిజిత్

‘బిగ్‌బాస్’ హౌస్ తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పించిందని చెబుతున్నాడు సీజన్-4 విజేత . ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్.. తాజాగా టైటిల్‌ను ఎగరేసుకునిపోయాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘జీవితంలో కొన్ని అనూహ్యంగా జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో మనం ఎలా స్పందిస్తాం?.. ఎవరితో ఎలా ఉంటాం? అనేదే ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు. Also Read: ‘ బిగ్‌బాస్ విజేతగా నిలిచాననే ఆనందం కంటే, ఇంత మంది ప్రేమని సొంతం చేసుకున్నాను.. అన్న విషయమే నాకు సంతోషాన్నిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు ఉంటాయి. బిగ్‌బాస్ విన్నర్‌ని కావడం నాకు భిన్నమైన అనుభవం. నాపై ప్రేక్షకులకు ఇంత ప్రేమ, అభిమానం ఉందా? అని ఆశ్చర్యం కలిగింది. కుటుంబం, స్నేహం ఎంత ముఖ్యమో బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు బాగా అర్థమైంది. బయటికొచ్చాక నా స్నేహితులు, నా వాళ్లు నా పక్కనే ఉండాలనిపిస్తుంది’ బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటికి రాగానే రోజంతా అమ్మా నాన్న, నాన్నమ్మ, నా పెంపుడు కుక్క రౌడీతోనే గడిపా. సినిమానే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇకపై మళ్లీ సినిమాలతో బిజీ అవుతా’ అన్నాడు అభిజిత్. బిగ్‌బాస్‌ విన్నర్‌గా అభిజిత్‌కు వచ్చిన క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు టాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు ఆయన్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. తమ సినిమాల్లో నటించాలని అడ్వాన్సులు కూడా పంపిస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3heuOdq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...