Tuesday, 8 December 2020

నిహారిక పెళ్లి: కొడుకు, కూతురుతో ఉదయ్‌పూర్‌లో దిగిన పవర్ స్టార్

పవర్ స్టార్ తన ఇద్దరు పిల్లలు (రేణు దేశాయ్ పిల్లలు) అకీరా నందన్, ఆద్యలతో కలిసి ఉదయ్‌పూర్‌లో దిగారు. తన అన్నయ్య నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి పవన్ కళ్యాణ్, అకీర, ఆద్య బయటకు వస్తోన్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అకీర లుక్‌ను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆరడుగుల బుల్లెట్‌లా కనిపిస్తున్నాడు అకీర. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయ్‌పూర్‌ చేరుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి వీరంతా కలిసి నిహారిక సంగీత్ వేడుకను ధూంధాంగా నిర్వహించారు. ఈ సంగీత్ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, శిరీష్, బాబీ, వరుణ్ తేజ్ సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ పాటలకు నిహారిక, చైతన్య స్టెప్పులేశారు. ఇదిలా ఉంటే, నిహారిక-చైతన్యల వివాహం డిసెంబర్ 9న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరగనుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు నిహారిక, చైతన్య వివాహ వేడుకను వైభవంగా జరపనున్నారు. ఇప్పటికే సంగీత్ అయ్యింది. ఈరోజు మెహందీ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడైన వెంకట చైతన్యతో ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VSNcPo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...