Thursday, 24 December 2020

అగ్ర నిర్మాతను పట్టేసిన సిద్ధార్థ్.. ‘బొమ్మరిల్లు’ కాంబో రిపీట్!

‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలతో తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ‘మహాసముద్రం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దీనికి దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్‌ కూడా నటిస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిద్ధార్థ్‌కు మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు తెలుస్తోంది. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో సిద్దార్థ్‌ నటించనున్నాడట. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ కెరీర్లోనే ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిపోయిన ‘బొమ్మరిల్లు’కు దిల్ రాజే నిర్మాత. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుందన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WMv8Xw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...