Thursday, 24 December 2020

‘శాకుంతలం’లో టాప్ హీరోయిన్... గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించాడు . అయితే ఆ సినిమా ఆలస్యమయ్యేలా కనిపించడంతో ఈ గ్యాప్‌లో '' సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారాయన. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే ప్రతిబింబిస్తోంది. వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లోనే ‘శాకుంతలం’ పట్టాలెక్కించి వీలైనంత త్వరగా విడుదలకు సిద్ధం చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ‘శాంకుతలం’ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బుట్టబొమ్మ పూజా హెగ్గేని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న పూజా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా తాను సిద్ధమని గతంలోనే ప్రకటించింది. దీంతో గుణశేఖర్ ‘శాకుంతలం’లో కోసం ఆమెను సంప్రదించగా పూజా కూడా ఓకే చెప్పేసిందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై గుణశేఖర్ టీమ్ నుంచి గానీ, పూజా హెగ్డే నుంచి గానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం కొద్దిరోజుల వరకు అనుష్క పేరు వినిపించగా.. ఇప్పుడు పూజా పేరు వచ్చి చేరింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుష్క కంటే పూజా నటిస్తే ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pnwB2V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...