‘దిల్ తో హ్యాపీ హై జీ’ సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది బుల్లితెర నటి . వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. జర్నలిస్ట్ అయిన డోనాల్ నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న డోనాల్ కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న భయంకర అనుభవాలను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. Also Read: ‘ప్రారంభంలో ఓ షోకు నేను సెలక్ట్ అయ్యాను. రెమ్యునరేషన్ కూడా ఫైనల్ అయ్యాక ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తొలగించి వేరే నటిని తీసుకున్నారు. దీంతో ముంబయి ఇండస్ట్రీ అంటేనే నకిలీ, మోసం అన్న అభిప్రాయం వచ్చేసింది. అయినప్పటికీ నటనపై ఆసక్తి తగ్గకపోవడంతో ఆడిషన్స్‌కు వెళ్తూనే ఉండేదాన్ని’ ‘ఈ నేపథ్యంలోనే సౌత్‌లో ఓ డైరెక్టర్‌ను కలిశాను. అతడు నాకు ఛాన్స్ ఇస్తానన్నాడు కానీ.. ప్రతిఫలంగా తనతో ఓ రాత్రి గడపాలని కోరాడు. అతడి మాటలకు షాకై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవకాశాల కోసం అంత నీచానికి పాల్పడే క్యారెక్టర్ కాదు నాది. తిరిగి హిందీ పరిశ్రమలోనే అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఛాన్సులు వచ్చారు. ఇక్కడికి సరైన మార్గంలోనే ప్రవేశించారు. నా ప్రతిభే నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది’ అని చెప్పుకొచ్చారు డోనాల్ బిష్ట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38w37ZM
v
No comments:
Post a Comment