Monday, 14 December 2020

అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా అక్కడున్న వారి ప్రేమను గెలుచుకుంటూ ఉంటారు. తాజాగా నిహారిక, చైతన్య వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన బన్నీ.. అక్కడ కూడా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రేమను పొందగలిగారు. ఉదయ్‌పూర్‌లోని హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన నిహారిక, చైతన్య పెళ్లిలో పాల్గొనడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, విమాన ప్రయాణ సమయంలో అల్లు అర్జున్ కనబరిచిన క్రమశిక్షణ ఎయిర్‌పోర్టు అధికారులను ఆశ్చర్యపరిచింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రయాణంలోనూ మాస్క్ ధరించి మరికొందరికి స్ఫూర్తిగా నిలిచిన అల్లు అర్జున్‌కు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు అధికారిణితో కలిసి బన్నీ తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని మేం కోరుకుంటాం. అలాగే, వారు కూడా నిబంధనలను పాటించడం ద్వారా మేం సుక్షితంగా ఉండటానికి సహాయపడతారు. మరిచిపోకుండా మాస్క్‌లు ధరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు’’ అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లో సైతం అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురవడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎయిర్‌పోర్టు అధికారులు మాత్రమే కాదు.. బన్నీ ఫ్యామిలీ స్టే చేసిన స్టార్ హోటల్ సిబ్బంది కూడా ఆయన్ని సర్‌ప్రైజ్ చేశారు. అల్లు అర్జున్ హిట్ సినిమా టైటిల్స్‌‌తో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్స్‌ని గదిలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే పంచుకున్నారు. Also Read: కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకుని నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమాలో గందపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా బన్నీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ రఫ్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IMxemV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...