సీనియర్ నటి, దర్శకురాలు భర్త గణేశ్ (62) శుక్రవారం కన్నుమూశారు. తిరుచ్చిలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో గల స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కుటుంబానికి చెందిన జయచిత్ర సుమారు 200కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1970–80 కాలంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే కుంభకోణం ప్రాంతానికి చెందిన గణేశ్‌తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఆమ్రేష్ వీరి కుమారుడే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oqXdQ1
v
No comments:
Post a Comment