Thursday, 24 December 2020

హాట్ ఇమేజ్ కొసం అంజలి ఆరాటం... ఫేట్ మారుతుందా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది తెలుగమ్మాయి అంజలి. ఆమె చీరకట్టు, గోదావరి యాసలో మాట్లాడే విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కూడా ఆమెకు అలాంటి పాత్రలే రావడంతో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఆ ఇమేజ్‌ తన కెరీర్‌కు అడ్డు అవుతుందనుకుందో ఏమో తెలీదు గానీ.. ఇప్పుడు రూటు మార్చింది. ‘పావ కథైగళ్’‌‌లో లెస్బియన్‌గా హాట్ హాట్‌ అందాలతో రెచ్చిపోయిన అంజలి కొత్త ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అంజలి కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. ఆమెతో గ్లామర్ పాత్రలు చేయించేందుకు ఎంత పారితోషికమైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారట. దీంతో అంజలి పాపకు ‘పావ కథైగళ్’‌‌ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. అయితే హీరోయిన్‌‌గా ఫేడౌట్ అయ్యే సమయంలో ఇలాంటి ఇమేజ్ అవసరమా? అని కొందరు అంజలికి సూచిస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LX3PaQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...